నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆలయంలో గోదా రంగనాథుల కల్యాణం కన్నుల పండువగా జరిపారు. జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్లోని రామాలయంలో స్వామివారి కల్యాణం వేద పండితుల మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కల్యాణానికి పట్టణంలోని నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
పండితులు గోదా రంగనాథుల ఉత్సవ విగ్రహాలను వివిధ రకాల పూలతో అలంకరించారు. సంప్రదాయబద్ధంగా చేపట్టిన జీలకర్ర బెల్లం, ముత్యాల తలంబ్రాలు, మాంగళ్య ధారణ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: తెలుగు లోగిళ్లలో భోగి భాగ్యాలు