ETV Bharat / state

Insects in Basara IIIT mess: నిన్నటి కూరలో కప్ప.. నేడు తోకపురుగు.. - frog found in tiffin

Insects in Basara IIIT mess: బాసర త్రిపుల్ ఐటీలో వంటకాల్లో కీటకాలు కలకలం సృష్టిస్తోంది. శనివారం కూరలో కప్ప వచ్చిందని ఆరోపించిన విద్యార్థులు.. ఈ రోజు వండిన కూరలో తోక పురుగు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. నిజానిజాలను తెలుసుకునేందుకు వెళ్లిన మీడియాను సెక్యూరిటీ సిబ్బంది అనుమతించడం లేదు.

frog and Tail worm found in tiffin and lunch
ఆర్జీయూకేటీలో ఆహారంలో కప్ప, తోకపురుగు
author img

By

Published : Mar 6, 2022, 4:45 PM IST

Insects in Basara IIIT mess: ప్రాథమిక అవసరాల్లో ఒకటైన ఆహారం.. నాణ్యతగా ఉన్నప్పుడే విద్యార్థులు చదివేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఆ ఆహారమే సరిగా లేకపోతే.. అది వారి ఆరోగ్యానికే ప్రమాదకరం. బాసర త్రిపుల్​ఐటీ మెస్​లో వరుసగా రెండు రోజులపాటు చోటుచేసుకున్న సంఘటనలు ఆందోళనకు దారితీస్తున్నాయి. నాణ్యమైన, ఉన్నత విద్యకు కేరాఫ్​గా నిలిచే విశ్వవిద్యాలయంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఆరోగ్యంపై ఆందోళన

frog and Tail worm found in tiffin and lunch
అల్పాహారంలో కప్ప

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విశ్వ విద్యాలయంలో.. శనివారం ఉదయం టిఫిన్ చేస్తుండగా కూరలో కప్ప వచ్చిందనే వార్త.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అది మరువకముందే ఇవాళ మధ్యాహ్న భోజన సమయంలో కూరలో తోకపురుగు వచ్చిందనే వార్త కలవరపెడుతోంది. కాగా అప్పటికే భోజనం చేసిన విద్యార్థులు.. తమ ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. భోజనం చేయని విద్యార్థులు.. అలాగే పస్తులుండిపోయారు. ఆ ఫొటోలను విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్​గా మారాయి.

మధ్యాహ్న భోజనంలో తోకపురుగు

మీడియాకు నో పర్మిషన్​

కాగా ఈ విషయంపై ఆరా తీసేందుకు యూనివర్సిటీ వద్దకు వెళ్లిన మీడియాను సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. దీంతో పలు అనుమానాలకు బలం చేకూర్చినట్లుగా ఉంది. పై అధికారులు మీడియాను అనుమతించవద్దని చెప్పారని సిబ్బంది బదులిచ్చారు.

ఇదీ చదవండి: Green India Challenge: 'ఒక్క చెట్టు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం లాంటిదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.