మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పీవీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 14 భాషలు మాట్లాడగలిగిన ఏకైక ప్రధానిగా పీవీ... చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.
దేశానికి అందించిన విశిష్ట సేవలను తలుచుకుంటూ... శత జయంతి ఉత్సవాలను ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు పీవీ అంటే ప్రత్యేక అభిమానమని... అందుకే ఆయన కుమార్తె వాణీదేవిని ఎమ్మెల్సీ పదవీ ఇచ్చి గౌరవించారని తెలిపారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండవద్ద పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగిందని అన్నారు.
నిర్మల్ పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని స్థానికులతో అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు తదితరులు పాల్గొన్నారు
జ్ఞానభూమిలో... 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహం..
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు రాష్ట్రంతో పాటు ఇతర దేశాల్లో... ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు ఘనంగా నిర్వహించాయి. ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ముగింపు వేడుకలు జరిపారు. గవర్నర్ తమిళి సై ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై... 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: 'పీవీ.. తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు'