ETV Bharat / state

సేవా దృక్పథం కొందరికే సొంతం: జిల్లా ఎస్పీ - nirmal district news

సేవా దృక్ఫథంతో ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అభినందనీయమని నిర్మల్​ జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. భారత్‌ కాటన్‌ మిల్లు సిర్గాపూర్‌ యజమాని ప్రకాష్‌ ధనానివాల బ్రదర్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్​ జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

food distribution in nirmal district
సేవా దృక్పథం కొందరికే సొంతం: జిల్లా ఎస్పీ
author img

By

Published : May 29, 2020, 4:56 PM IST

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అభినందనీయమని, అలాంటి గొప్ప మనస్సు కొందరికే ఉంటుందని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు.నిర్మల్ జిల్లాలోని భారత్ కాటన్ మిల్లు సిర్గాపూర్ యజమాని ప్రకాష్ దనానివాల అండ్ బ్రదర్స్ జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయ ఆవరణలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు గత 45 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు.

లాక్​డౌన్ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సరైన సమయానికి ఆహారం లభించక నానా అవస్థలు పడుతున్నప్పుడు, భారత్ కాటన్ మిల్లు యాజమాన్యం స్పందించడం అభినందనీయమన్నారు.గత 45 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న భారత్ కాటన్ మిల్లు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ శాలువతో సన్మానించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ బి.వెంకటేష్, సీఐలు జీవన్ రెడ్డి, రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి: తెలంగాణ ప్రజలకు త్వరలో తీపికబురు : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.