నిర్మల్ జిల్లా ముధోల్, బాసర పలు మండలాల్లో మోస్తరుగా వర్షం పడడం వల్ల రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పంట పొలాల్లో ఇటీవల వేసిన పంట మొగ్గ దశలో ఉన్న విత్తనాల పెరుగుదల సమయంలో వర్షం పడడం కొండంత అండనిచ్చిందన్నారు.
ఖరీఫ్ ప్రారంభంలో తొలకరి చినుకులకే రైతన్నలు వారి భూముల్లో విత్తనాలు వేశారు. కొందరి అన్నదాతల భూములలో విత్తనాలు మొలకెత్తక మళ్లీ విత్తనాలు వేశారు. రెండోసారి విత్తనాలు వేసిన నుంచి వర్షం లేకపోవడం వల్ల రైతన్నలు దిగులు చెందారు. అయితే సోమవారం వర్షం పడినందున హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్