ఎన్నికల కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్లు - vv pat
లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నాయి. ఎన్నికల సామాగ్రిని జిల్లా కేంద్రాలకు చేరుస్తున్నారు. మాక్ పోలింగ్ నిర్వహించి ఎన్నికల సిబ్బందికి అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈవీఎంలు, వీవీప్యాట్ల పరిశీలన
సార్వత్రిక ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలోని నియోజకవర్గాలకు కావలసిన సామాగ్రిని ఎన్‌టీఆర్ మినీ స్టేడియంకు తరలించారు. ఎంపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నవారి వివరాలు, ఈవీఎంలు అమర్చే పని మొదలుపెట్టారు. సెక్టోరల్, రూట్ అధికారులు ఈ విధులు నిర్వహిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై మాక్ పోలింగ్ నిర్వహించి 10న ఎన్నికల సిబ్బందికి అందజేయనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.
sample description