ETV Bharat / state

Etela Rajender on Telanana Floods : 'వరదల్లో ఇళ్లు కోల్పోయినవారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలి' - Etela Rajender fires on KCR

Etela Rajender Comments on KCR : కడెం ప్రాజెక్టు దుస్థితికి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలే కారణమని ఈటల రాజేందర్ ఆరోపించారు. గతంలో ప్రకటించిన పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పటికీ రాలేదని విమర్శించారు. ప్రభుత్వం అన్ని శాఖల అధికారులతో కమిటీలు వేసి బాధితులను ఆదుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Etela Rajender
Etela Rajender
author img

By

Published : Jul 31, 2023, 5:01 PM IST

Updated : Jul 31, 2023, 5:08 PM IST

Etela Rajender Fires on Telangana Government : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోదావరి, పెన్​గంగ, ప్రాణహిత నదుల సంగమంగా ఉందని.. కానీ మానవ తప్పిదం కారణంగా దుఃఖదాయనిగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్​ ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. మరవైపు పంట పొలాలు కొట్టుకుపోయి.. ఇసుక మేటలు వేశాయని తెలిపారు. బీజేపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని చెప్పారు. కడెం ప్రాజెక్టు దుస్థితికి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలే కారణమని విమర్శించారు. నిర్మల్ జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Etela Rajender Comments on KCR : గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 ప్రకటించారని.. అదీ ఇప్పటికి పంపిణీ కాలేదని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. వాగులమీద కాకుండా.. ప్రతికుల ప్రాంతాల్లో చెక్ డ్యామ్​లు కట్టడమే.. ఈ అనర్థానికి కారణమని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో.. కళ్లముందే మనుషులు వరదల్లో కొట్టుకుపోయారని చెప్పారు. ఇప్పటివరకూ అధికారికంగా వరదల వల్ల 20 మంది చనిపోయారని.. అనధికారికంగా ఎందరో అని ఈటల రాజేందర్ వివరించారు.

Etela Rajender on Telanana Floods : ఈ క్రమంలోనే ఇళ్లు మునిగిపోయిన కుటుంబాలకు రూ.25,000 చొప్పున పరిహారం ఇవ్వాలని ఈటల రాజేందర్ తెలిపారు. అదేవిధంగా ఇండ్లు కోల్పొయినవారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణం చేపట్టాలని అన్నారు. అన్ని శాఖల అధికారులతో కమిటీలు వేసి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

"కడెం ప్రాజెక్టు దుస్థితికి సీఎం అనాలోచిత నిర్ణయాలే కారణం. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతంలో ప్రకటించిన పంట నష్ట పరిహారం ఇప్పటికి రాలేదు. ప్రతికూల ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు కట్టడమే అనర్థానికి కారణం. కళ్ల ముందే భూపాలపల్లి జిల్లాలో మనుషులు వరదల్లో కొట్టుకుపోయారు. అన్ని శాఖల అధికారులతో కమిటీలు వేసి బాధితులను ఆదుకోవాలి. ఇళ్లు కోల్పోయినవారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలి. ముంపు ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణం చేపట్టాలి." - ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్​

అన్ని శాఖల అధికారులతో కమిటీలు వేసి బాధితులను ఆదుకోవాలి

KishanReddy Comments on CM KCR : మరోవైపు రాష్ట్రంలో వరదలతో జనం అల్లాడుతుంటే.. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. విపత్తు వేళ ఆదుకునేందుకు.. తెలంగాణ సర్కార్ వద్ద రూ.900 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. అయినా తాత్కాలిక సాయం కూడా అందించలేకపోయారని ఆరోపించారు. నేటి నుంచి రాష్ట్రంలో కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తాయని వివరించారు. అతి తక్కువ సమయంలో కేంద్ర బృందాన్ని మోదీ, అమిత్​ షాలు తెలంగాణకు పంపించారని కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి : KishanReddy on Telanana Floods : 'వరదలతో జనం అల్లాడుతుంటే.. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది'

Warangal Floods News : ఓరు'ఘొల్లు'.. ఆ హృదయ విదారక దృశ్యాలు అన్నీ ఇన్నీ కావు.. చూస్తే గుండె బరువెక్కాల్సిందే..

Last Updated : Jul 31, 2023, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.