ETV Bharat / state

వైద్యులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు: కలెక్టర్ - జిల్లా కలెక్టర్​ ముషారఫ్ ఫారుఖీ

నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినందున ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు, ఓపీ పేషెంట్లకు వైద్యులు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ అన్నారు.

District Collector Musharraf Farooqi Review meeting on Corona virus in Nirmal district
వైద్యులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు
author img

By

Published : May 10, 2020, 12:58 PM IST

నిర్మల్​ జిల్లాలో కరోనా వైరస్​ ప్రభావంపై జిల్లా కలెక్టర్​ ముషారఫ్ ఫారుఖీ కలెక్టరేట్​లో వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యం, ఓపీ కేసులను పరీక్షించాలని తెలిపారు. జిల్లాలో 20 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 17 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అంతర్ రాష్ట్ర, అంతర్​ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి బయటి నుంచి ఎవరు కూడా రాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దుకాణాలను సరి, బేసి సంఖ్యలో ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లలో 500 మీటర్ల వరకు కఠిన చర్యలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. వైద్యులు ఏ మాత్రం భయాందోళనకు గురి కాకుండా మాస్క్​లను ధరించి సామాజిక దూరం పాటిస్తూ రోగులకు వైద్య సేవలు అందించాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.