రంజాన్ పండుగను కరోనా నిబంధనలు పాటిస్తూ ఆనందంగా జరుపుకోవాలని కౌన్సిలర్ తౌహీరుద్దిన్ రఫ్ఫూ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని 39వ వార్డు గుల్జార్ మసీద్‌లో పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం అందించే రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేశారు.
ముస్లింలకు ఏటా ప్రభుత్వం రంజాన్ కానుక అందిస్తుందని.. పేద ముస్లిం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుల్జార్ మసీద్ అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ బషీర్, ఎంఏ వహీద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 5,186 కరోనా కేసులు.. 38 మంది మృతి