Different Verdict In Nirmal Constituency : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్‌కు రాష్ట్రంలోనే రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నాయకులను అందించిన ఘనత ఈ ప్రాంతానిది. అలాంటి నిర్మల్ చరిత్ర సృష్టికి నిలయమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాష్ట్రంలో అధికార పార్టీ ఏదున్నా, దానితో ఏమాత్రం సంబంధం లేకుండా భిన్నమైన తీర్పు ఇవ్వడం ఈ నియోజకవర్గ ప్రజల ఆనావాయితీగా వస్తోంది. తాజా ఎన్నికల్లోనూ ఇది మరోసారి ప్రస్ఫుటమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిర్మల్‌లో బీజేపీ అభ్యర్తిని గెలిపించడం విశేషం. గత ఎన్నికలను పరిశీలిస్తే..
కేసీఆర్ హ్యాట్రిక్ విన్‌కు బ్రేక్ - తెలంగాణలో కారు పంక్చర్ కావడానికి కారణాలేంటి?
Nirmal BJP Candidate Maheshwar Reddy Won : నిర్మల్ నియోజకర్గ అసెంబ్లీ ఎన్నికల తీర్పు ఓ చరిత్ర అని చెప్పవచ్చు. ఆదివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నిర్మల్ బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీస్తుంటే ఇక్కడ మాత్రం విరుద్ధంగా ఫలితమొచ్చింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై 50 వేల పై చిలుకు ఓట్లతో గెలుపు దక్కించుకున్నారు. ఇది నిర్మల్ నియోజకవర్గం పరంగా రికార్డ్ స్థాయి మెజార్టీ రావడం గమనార్హం. అంతేకాకుండా గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు పోటీ చేసిన అభ్యర్థుల్లో లక్షకు పైచిలుకు ఓట్లు సాధించడం ఇదే మొదటి సారి.
Maheshwar Reddy Political Entry In 2009 : మహేశ్వర్ రెడ్డి 2006లో మహేశ్వర ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించి నిర్మల్ నియోజకవర్గమంతా పాదయాత్రలు చేపట్టి ప్రజలకు దగ్గరై, 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2004 లో కాంగ్రెస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారు. ఆ సమయంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. 2009 ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి మహేశ్వర్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారపీఠం దక్కించుకుంది. అనంతరం మెగాస్టార్ చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
2014 బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఇంద్రకరణ్ రెడ్డి అనూహ్య విజయం దక్కించుకున్నారు. అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకుంది. ఆ సమయంలోనే అల్లోల టీఆర్ఎస్లో చేరారు. 2019 బీఆర్ఎస్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారు. అధికార పార్టీ అభ్యర్థిగా ఆయన గెలవడం విశేషమైతే, దేవాదాయ శాఖ మంత్రిగా వరుసగా రెండో సారి గెలవడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రథమం కావడం ప్రత్యేకమే.
రజనీకాంత్‌కు బిగ్ షాక్- టికెట్లు అమ్ముడుపోక సూపర్ స్టార్ సినిమా షోలు రద్దు!
తెలంగాణలో నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ సర్కార్ - సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం!