నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, లాక్డౌన్ సమయంలో ప్రజలపై విద్యుత్ భారాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాలని గానీ.. ఇలా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, నిరంకుశంగా వ్యవహరించడం సరికాదన్నారు. విద్యుత్ బిల్లులను రద్దు చేసి.. 300 యూనిట్ల వరకు ప్రభుత్వమే ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. కరోనా పరీక్షలకు ప్రభుత్వమే ఖర్చులు భరించాలని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని కోరారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్