ETV Bharat / state

దంపతుల మధ్య గొడవ..శవమైన భర్త - భర్త మృతి

భార్య భర్తల మధ్య గొడవ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి చివరికి శవమై కనిపించాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Conflicts of family husband dead at nirmal
దంపతుల మధ్య గొడవ..శవంగా మారిన భర్త
author img

By

Published : Mar 22, 2020, 10:16 AM IST

నిర్మల్​ జిల్లా బైంసా మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన చర్ల గంగారామ్​(48), కళావతి దంపతులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఫిబ్రవరి 22న చిన్న గొడవ జరిగి కళావతి తన బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. కళావతిని ఇంటికి రమ్మంటూ వారి కూతురి ద్వారా కుబురు పంపిన గంగారామ్​.. మార్చి 2నభార్య కళావతి వాలేగాంకు వస్తుందని తెలుసుకుని తను రాకముందే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

దంపతుల మధ్య గొడవ..శవంగా మారిన భర్త

కళావతి వచ్చి బంధువుల ఇంట్లో చుట్టుపక్కల వారి ఇళ్లల్లో ఎంత వెతికినా గంగారామ్​ ఆచూకీ లభించలేదు. చివరికి మార్చి 15న భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్లో తన భర్త కనిపించడం లేదంటూ కళావతి ఫిర్యాదు చేసింది. శనివారం భైంసా మండలం దేహగాం గ్రామ సమీపంలోని వాగులో ఓ శవం తేలియాడుతూ ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, గ్రామస్థులు వేరువేరుగా పడి ఉన్న తల, శరీరాన్ని పరిశీలించి గంగారామ్​ మృతదేహంగా అనుమానిస్తూ అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

శవం కుళ్లి పోయి ఉండడం వల్ల గుర్తు పట్టడానికి వీలులేకుండా పోయింది. కాగా చెట్టుకు వేలాడుతున్న లుంగీని చూసి ఆ బట్టలు తన తండ్రివేనని చెప్పి గంగారామ్​ కూతురు కుప్పకూలిపోయింది. తల్లి తండ్రి గొడవపడ్డా మళ్లీ కలుసుకుంటారనుకుంటే ఇలా జరిగిందని కన్నీరుమున్నీరుగా విలపించింది. శవం పూర్తిగా కుల్లిపోయి ఉండడం వల్ల వైద్యులు అక్కడికక్కడే శవపంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.

ఇవీ చూడండి: 'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.