జిల్లాలో కొవిడ్ కట్టడికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జిల్లా పాలనాధికారి ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. జిల్లాలోని కుంటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భైంసా ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, పాజిటివ్ వచ్చిన బాధితులకు అందిస్తున్న సేవలను గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
రోగులకు ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని... వ్యాక్సిన్ పంపిణీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు హోం క్వారంటైన్లోనే ఉండాలని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ తదితరులున్నారు.
ఇదీ చూడండి: మాస్క్ ఎందుకు పెట్టుకోలేదంటే... వింత వింత సమాధానాలు