నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వందశాతం ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలపై వైద్యులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 100 శాతం ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు తెలిపారు.
గర్భిణులకు, కుటుంబసభ్యులకు ఆపరేషన్ల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రోజు ప్రసవాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించాలని.. ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ.. అప్రమత్తంగా ఉంటే మరణాల రేటును తగ్గించాలన్నారు. కొవిడ్‌పై ప్రజలు భయపడకుండా వారు అన్ని జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు.