నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో సాధారణ ప్రసవాలపై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో విడివిడిగా ఆయన సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో ప్రభుత్వ నిబంధనలను అమలు చేస్తూ గర్భిణులు, కుటుంబసభ్యులకు ఆపరేషన్ల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు ప్రసవాల వివరాలను ఆన్ లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.