ETV Bharat / state

'సీఎం వ్యాఖ్యలను  ఉపసంహరించుకోవాలి'

ఎవరో ఒకరు చేసిన తప్పునకు రెవెన్యూ ఉద్యోగులందరిని నిందించడం సీఎం కేసీఆర్​కు​ సరికాదని నిర్మల్​ జిల్లా సిబ్బంది ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సంయుక్త పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు.

రెవెన్యూ ఉద్యోగుల వినతిపత్రం
author img

By

Published : Mar 30, 2019, 6:58 PM IST

Updated : Mar 30, 2019, 7:30 PM IST

సీఎం వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన
నిర్మల్​ జిల్లా కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. మంచిర్యాల జిల్లా నందులపల్లి గ్రామంలో వారసత్వ పట్టా వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ రెవెన్యూ ఉద్యోగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని నిరసన తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేను ఒకరోజులో పూర్తి చేసి చరిత్ర సృష్టించిన ఉద్యోగులను అవమానించడం బాధాకరమని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్​ అన్నారు. సీఎం తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. జిల్లా సంయుక్త పాలనాధికారి భాస్కర్​ రావుకు వినతి పత్రం అందజేశారు.

ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జేసీ భాస్కర్​ రావు తెలిపారు.

ఇవి చూడండి:కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...!

Intro:filename:

tg_adb_02_30_spm_8no_trayal_run_av_c11

Body:సిర్పూర్ కాగితం మిల్లు పునరుద్ధరణ చర్యలు శర వేగంగా కొనసాగుతున్నాయి. 2018 ఆగస్టు 2న యాజమాన్యం ఎస్ పి ఎం మిల్లును జేకే యాజమాన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత మరమ్మత్తులు పనులు చేపడుతోంది. రెండు నెలల క్రితమే ఏడవ నంబరు కాగితం ఉత్పత్తి యంత్రం నుండి ఉత్పత్తి ప్రారంభించిన యాజమాన్యం ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఎనిమిదవ కాగితం ఉత్పత్తి యంత్రం ప్రయోగ పరిశీలన చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రయోగ పరిశీలన చేశారు. ఏడవ నెంబరు యంత్రం నుంచి రోజుకు 80 నుంచి 90 టన్నుల కాగితం ఉత్పత్తి చేపడుతుండగా.. ఎనిమిదవ యంత్రం నుంచి రోజుకు దాదాపు 200 నుండి 250 టన్నుల కాగితం ఉత్పత్తి చేయనున్నట్టు పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. మరో రెండు నెలల లోపు 3వ నెంబరు 6వ నెంబరు కాగితం ఉత్పత్తి యంత్రాల మరమ్మతులు కూడా పూర్తి చేసి ప్రయోగ పరిశీలన చేపట్టనున్నట్టు ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ మాసం వరకు అన్ని యంత్రాల నుంచి కాగితం ఉత్పత్తి ప్రారంభించేందుకు యాజమాన్యం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఎనిమిదవ నెంబరు కాగితపు ఉత్పత్తి యంత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో లో ప్రెసిడెంట్ ఏ.ఎస్. మెహతా, డైరెక్టర్ కుమారస్వామి, డైరెక్టర్ పీకే సూరి, వైస్ ప్రెసిడెంట్ మయాంక్ జిందాల్, హెచ్.ఆర్. అనిల్ దీక్షిత్ జనరల్ మేనేజర్ ఆలోక్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.

గమనిక: వార్తకు సంబంధించిన చిత్రాలు సేమ్ ఫైల్ నేమ్ తో డెస్క్ వాట్సాఅప్ కు పంపడమైనది. తీసుకోగలరు...

Conclusion:
Last Updated : Mar 30, 2019, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.