ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరను సీఎం కేసీఆర్ 7వ తేదీన దర్శించుకోనున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. అలాగే ఈ జాతరకు కోటి 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేయడం జరిగిందని తెలిపారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా బస్సుల ఏర్పాటు పోలీసు బందోబస్తు, పరిశుద్ధ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొన్నట్లు వెల్లడించారు. ఈ జాతరకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించాలని మంత్రి డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:వనమంతా జనమయ్యేది రేపట్నుంచే..