ETV Bharat / offbeat

బయట చేసే టీ స్టాల్ స్టైల్ "ఛాయ్" - ఈ కొలతలతో చేసుకున్నారంటే ఇరానీ టీ కంటే సూపర్ టేస్ట్! - TEA STALL TEA RECIPE

ఈ కొలతలతో ఇంట్లో "టీ" పెట్టుకోండి - బయట అమ్మే టీ స్టాల్ కంటే రుచికరంగా ఉంటుంది!

How to Make Tea
Tea Stall Style Chai (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2024, 5:52 PM IST

How to Make Tea Stall Style Chai : మనలో దాదాపు చాలా మందికి ఉదయం పూట టీ తాగే అలవాటు ఉంటుంది. కప్పు టీ కడుపులో పడందే రోజు మొదలు కాదు. కొందరైతే డైలీ కనీసం నాలుగైదు సార్లైనా గరంగరం ఛాయ్ తాగేస్తుంటారు. ఇక టీ ప్రేమికులైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక కప్పు వేడి ఛాయ్ లేని రోజును వారు అస్సలు ఊహించుకోలేరని చెప్పుకోవచ్చు. అంతలా ఇష్టపడే టీని ఒక్కొక్కరు ఒక్కోలా ప్రిపేర్ చేసుకుంటుంటారు.

అయితే, కొన్నిసార్లు ఛాయ్ సరిగా కుదరక.. టీ ఏం బాగాలేదు, పల్చగా ఉందని, స్ట్రాంగ్​గా లేదని ఇలా రకరకాల కామెంట్లు వినిపిస్తుంటాయి. మరికొందరైతే బయట టీ తాగినప్పుడు చాలా రుచికరంగా అనిపిస్తుంది. ఇంట్లో చేసుకుంటే అలా ఎందుకు రావట్లేదని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఈ టిప్స్ ఫాలో అవుతూ ఛాయ్ ప్రిపేర్ చేసుకున్నారంటే టీ స్టాల్ టేస్ట్​కి ఏమాత్రం తీసిపోదు! ఇంతకీ, టీ స్టాల్ స్టైల్​లో స్ట్రాంగ్​గా, మంచి టేస్ట్​తో మసాలా టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • వాటర్ - 2 గ్లాసులు
  • యాలకులు - 2
  • అల్లం - అంగుళం ముక్క
  • దాల్చిన చెక్క ముక్క - చిన్నది
  • టీ పౌడర్ - 2 టీస్పూన్లు
  • చక్కెర - రుచికి తగినంత
  • పాలు - 1 గ్లాసు

లెమన్​, గ్రీన్ టీలు మాత్రమే కాదు - ఈ టీ తాగినా బోలెడు ప్రయోజనాలు! వయసు కూడా తగ్గిపోతారట!

తయారీ విధానం :

  • ఇక్కడ మేము ఇద్దరు వ్యక్తులకు సరిపోయే క్వాంటిటీలో టీ రెసిపీని అందిస్తున్నాం. ఒకవేళ ఎక్కువ మందికి కావాలనుకుంటే ఈ కొలతలను పెంచుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై టీ ప్రిపేర్ చేసుకునే గిన్నె పెట్టుకొని మీరు టీ తాగే గ్లాసు లేదా కప్పుతో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి.
  • ఆలోపు చిన్న రోలు​లో ముందుగా యాలకులు, ఆపై అల్లం ముక్కలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
  • అనంతరం స్టౌపై వేడిచేసుకుంటున్న వాటర్ బాగా మరిగాయనుకున్నాక అందులో దంచుకున్న అల్లం యాలకుల మిశ్రమం, దాల్చిన చెక్క వేసుకొని కలుపుతూ మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి.
  • ఆవిధంగా మరిగించుకున్నాక.. మెజరింగ్ టీ స్పూన్​తో టీ పౌడర్, పంచదార వేసుకొని మరో రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుతూ వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో వాటర్ తీసుకున్న కప్పు లేదా గ్లాసుతో ఒక కప్పు వరకు వేడి చేసుకున్న పాలను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అయితే, మీరు వాడే పాల క్వాంటిటీ పల్చగా ఉంటే నీళ్ల క్వాంటిటీ తగ్గించుకొని మిల్క్ క్వాంటిటీని పెంచుకోవాలి.
  • ఆపై మంటను మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్​లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో తిప్పుతూ, వడపోస్తున్నట్లు పై నుంచి పోస్తూ మరో 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
  • ఆ తర్వాత గ్లాసులలోకి వడకట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "టీ స్టాల్ స్టైల్ టీ" రెడీ! దీన్ని వేడివేడిగా తాగితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

మార్కెట్లో "కల్తీ టీ పొడి" హల్​చల్​ - మీరు వాడేది స్వచ్ఛమైనదేనా? ఇలా గుర్తించండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.