రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టీ- వ్యాలెట్ కార్యక్రమానికి స్వీకారం చుట్టిందని నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో రేషన్ డీలర్లకు టీ- వ్యాలెట్ నిర్వహణపై ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈపాస్ విధానం ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న డీలర్లు ఇక నుంచి టీ- వ్యాలెట్ యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జేసీ తెలిపారు. టీ- వ్యాలెట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ప్రతి రేషన్ షాప్‌లో నగదు బదిలీలు, మొబైల్ రీఛార్జ్‌లు, ఇంటర్నెట్ సేవలు, గ్రామపంచాయతీ సంబంధించిన పనులు, విద్యుత్ బిల్లులు తదితర వాటిని చెల్లించుకోవచ్చని తెలిపారు. రేషన్ డీలర్లకు ఒక్కొ సర్వీస్‌కు రెండు రూపాయల కమిషన్‌ను అందించడం జరుగుతుందన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి రేషన్ డీలర్లు టీ- వ్యాలెట్ ద్వారా అన్ని సేవలను అందించాలని సూచించారు.
ఇవీ చూడండి: తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర ఇదే!!