ETV Bharat / state

BRS campaign in Telangana 2023 : ప్రచారంలో కారు జోరు.. కేసీఆర్ భరోసాతో ప్రజల్లోకి బీఆర్ఎస్ నేతలు.. పలుచోట్ల నిరసన గళమెత్తుతున్న ప్రజలు - నిర్మల్​లో బీఆర్​ఎస్​ నాయకులను ప్రశ్నించిన జనం

BRS campaign in Telangana 2023 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కారు ప్రచార జోరు పెంచింది. అధినేత నుంచి కార్యకర్తల వరకు తమదైన శైలిలో.. పదేళ్ల ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నారు. ఓ వైపు విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ.. మరోవైపు మేనిఫెస్టోను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గులాబీదళపతి దిశానిర్దేశంతో గెలుపే లక్ష్యంగా బీఆర్​ఎస్​ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

People Questioned BRS Leaders in Medak
BRS Leaders Campaign in Telangana State Wide
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 9:13 AM IST

BRS Election Campaign 2023 ప్రచారంలో బీఆర్ఎస్​ నాయకులు.. పలుచోట్ల చుక్కెదురు

BRS campaign in Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్​ఎస్​ అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్ రూపురేఖలు మార్చారని మంత్రి హరీశ్​రావు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఒకటి రెండు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని హరీశ్‌ ధ్వజమెత్తారు. ఉదయం వచ్చిన వాళ్లకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్‌లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ ఏమైందని నాగం జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. అసమర్థుడి నాయకత్వంలో పనిచేయడం కష్టమని బీఆర్​ఎస్​లో చేరినట్లు తెలిపారు.

People Questions BRS Leaders : మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్​కు 14 స్థానాలూ గెలుచుకునే సత్తా వచ్చిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పార్టీ నాయకులకు చుక్కెదురైంది. అభివృద్ధి పనులు చేయనప్పుడు తమ గ్రామానికి ప్రచారానికి రావొద్దని బీఆర్​ఎస్​ నాయకులను గ్రామస్థులు వెనక్కి(BRS Leaders Go Back) పంపించారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కోరారు.

BRS Campaign in Telangana 2023 : కారు.. ప్రచార జోరు.. హ్యాట్రిక్‌ లక్ష్యంగా దూసుకుపోతున్న బీఆర్ఎస్

BRS Manifesto 2023 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కారు గుర్తుకు ఓటేసేలా ప్రత్యేక ఫ్లకార్డులతో బీఆర్​ఎస్​ అభ్యర్థి మాణిక్ రావు ఇంటింటి ప్రచారం చేశారు. బీసీల సంక్షేమానికి బీఆర్​ఎస్​ సర్కారు కట్టుబడి ఉందని నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. రైతు సంక్షేమ పథకాల(Farmer welfare schemes in Telangana)ను ఎక్కడా లేని విధంగా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోందని నారాయణపేట జిల్లా దామరగిద్దలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వివరించారు. జిల్లాలో 40ఏళ్లుగా జరగని అభివృద్ధి 9 ఏళ్లలో చేసి చూపించామని తెలిపారు.

Padma Devender Reddy Comments on Mynampally : ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జడ్చర్లలో లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మెదక్‌లో మైనంపల్లి వచ్చాకే గొడవలు మొదలయ్యాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. ఇది మల్కాజిగిరి కాదని.. మెదక్ నియోజకవర్గమని గుర్తుంచుకోవాలన్నారు. నిజాంపేట్‌ మండలం జెడ్‌చెర్వు తండాలో రెండు పడకగదుల ఇళ్లు, మూడెకరాల భూమి.. ఏవని పద్మాదేవేందర్‌రెడ్డిని స్థానికులు నిలదీశారు. తమ తండాలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ బీఆర్​ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు.

BRS Launch KCR Bharosa Campaign : 'జనంలోకి 'కేసీఆర్ భరోసా'.. మళ్లీ గెలిస్తే కచ్చితంగా జాబ్‌ క్యాలెండర్‌ అమలు''

BRS Leaders Comments on Congress Party : విపక్షాలపై దాడి చేసేందుకు బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని మంత్రి కేటీఆర్(KTR Comments on BJP) ఆరోపించారు. ప్రభుత్వ స్పాన్సర్ అటాకర్లు తన ఫోన్‌ను టార్గెట్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. పొరపాటున రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దోచుకోవడమే తప్ప మరేమీ ఉండదని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆరోపించారు. ఉత్తమ్‌, జానారెడ్డి, వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి.. వీరిలో సీఎం అభ్యర్థి ఎవరంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రగతి కొనసాగాలంటే బీఆర్​ఎస్​కు మరోసారి పట్టం కట్టాలని.. చేవెళ్ల మండలంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య అభిప్రాయపడ్డారు. సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు తెర తీసిందని.. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మండిపడ్డారు.

CM KCR Election Campaign in Joint Nalgonda Today : ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు.. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ సభలు

BRS Campaign in Telangana Assembly Elections : అభివృద్ధి నినాదం.. విపక్షంపై విమర్శల వాదం.. ప్రచారంలో కారు జోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.