భాజపాపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా నాయకుల పనితీరు ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అధికార పార్టీ నాయకుల అక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా నాయకులకు గంగారెడ్డి సూచించారు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన ప్రత్యక్షంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని కూడగట్టుకోవాలన్నారు. ఈ సమావేశంలో భాజపా నాయకులు భూమయ్య, రాంనాథ్, రమాదేవి, మెడిసెమ్మె రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, అప్పాల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వ్యాక్సిన్ ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది.. బయట లేదు : డీహెచ్