నిర్మల్ జిల్లా కేంద్రంలో జౌలీ నాలా సమస్యను పరిష్కరించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. నాయుడివాడ నుంచి కురన్నపేట వరకు భాజపా నాయకులు పాదయాత్ర చేశారు. ప్రతి సంవత్సరం జౌలీ నాలా పూడిక పేరుతో దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేస్తూ తూతూ మంత్రంగా పనులు చేస్తున్నారని కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు.
వర్షాకాలం రాగానే నీళ్లు ఇళ్లలోకి రావడం, దోమలు, చెడువాసన, వ్యర్థ పదార్థాల వల్ల అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. ఇంత జరిగినా అధికారులు నిమ్మకూనిరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: తీవ్ర ఇన్ఫెక్షన్కూ భారతీయ టీకాలు చెక్!