సుమారు 150 ఎకరాల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలో రూపొందిస్తున్న అర్బన్ పార్క్‌ను ఇటీవల నియమితులైన శిక్షణా అటవీ బీట్ అధికారులు సందర్శించారు. పార్క్‌లో నిర్మిస్తున్న వివిధ నిర్మాణాలు, నడక కోసం ఏర్పాటు చేస్తున్న ట్రాక్ ఏర్పాట్లను పరిశీలించారు. కోతులను ఎలా పట్టుకుంటారు, ఎక్కడ ఉంచుతారు, ఏ రకంగా వాటికి కుటుంబ నియంత్రణ చేస్తారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండిః కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద రాజ్‌నాథ్ నివాళి