సూర్యగ్రహణం కారణంగా నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం తలుపులు బుధవారం సాయంత్రం మూసివేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ద్వారాలు తెరవనున్నట్లు అర్చకులు తెలిపారు. ఆలయ సంప్రోక్షణ చేసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకం నిర్వహించనున్నారు. ఆ తర్వాతే భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ శాఖల సరకు రవాణా.. ఆర్టీసీలోనే..!