ETV Bharat / state

Another death in Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతి.. అసలేం జరుగుతోంది..? - తెలంగాణ తాజా వార్తలు

Another Student died in Basara IIIT : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం దీపిక అనే విద్యార్థిని మరణించిన విషయం మరవకముందే తాజాగా మరో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెది.. ప్రమాదమా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Another death in Basara IIIT
Another death in Basara IIIT
author img

By

Published : Jun 15, 2023, 10:00 AM IST

Updated : Jun 15, 2023, 2:22 PM IST

Student died in Basara RGUKT : నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఇటీవల దీపిక అనే విద్యార్థిని మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా మరో విద్యార్థిని మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్​కు చెందిన​ లిఖిత (17) ఆర్జీయూకేటీలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతుంది. వసతిగృహంలో ఉంటున్న లిఖిత బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో నాలుగో అంతస్తు నుంచి కిందపడింది. గమనించిన భద్రతా సిబ్బంది క్యాంపస్ హెల్త్‌ సెంటర్‌లో ఆమెకు ప్రథమ చికిత్స చేపించారు. అనంతరం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Basara Student Likhita death News : ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిర్మల్​లో లిఖితను చూసిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదమా, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లిఖిత గజ్వేల్​కు చెందిన బుర్ర రాజు, రేణుకల పెద్ద కుమార్తె. రాజు గజ్వేల్​లో మిర్చిబండి నిర్వహిస్తూ తమ పిల్లలను చదివిస్తున్నాడు. లిఖిత ఇంటి నుంచి వారం రోజుల క్రితమే హాస్టల్​కు వెళ్లింది. ఇంతలోనే తమ కూతురు మృతి చెందిందనే వార్త తెలిసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Another Student died in Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న విద్యార్థుల మరణాలు.. ప్రభుత్వ హత్యలే అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి ఆరోపించారు. ట్రిపుల్ ఐటీలో వరుసగా విద్యార్థులు మరణించడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. విద్యార్థుల మరణాలపై వెంటనే జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు.

Bodapati Sejal suicide attempt : తెలంగాణ భవన్​ ప్రాంగణంలో యువతి ఆత్మహత్యాయత్నం

Basara Student Likhita death Case : నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఉన్న విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని ఆర్జీయూకేటీ ఇంఛార్జ్‌ వీసీ వెంకటరమణ పరిశీలించారు. లిఖిత మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని మృతి దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. లిఖిత మరణం ప్రమాదవశాత్తు జరిగిందని.. ఆర్జీయూకేటీలో మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని భరోసా కల్పించారు.. వీసీ రావడంతో ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. సమాధానం చెప్పకుండా వీసీ వెళ్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెళ్తున్న వాహనాన్ని సైతం వారు అడ్డగించారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తేచ్చారు.

Minister Sabita on Basara Student Death Case : ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఘటనలు బాధాకరమన్నారు. విద్యార్థిని దీపిక మృతిపై కమిటీ వేశామని దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇవాళ జరిగిన ఘటనలో ఇంకా పూర్తి సమాచారం లేదని చెప్పారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మీడియా సమావేశంలో అన్ని విషయాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 15, 2023, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.