మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. జిల్లాలోని దిలావర్పూర్ మండలంలో గల కదిలి, మామడ మండలంలోని బూరుగుపల్లి, లక్ష్మణ్ చందా మండలంలోని శ్రీ రాజ రాజేశ్వరి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం నుంచే ఆలయాలకు చేరుకొని భక్తులు పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించిన అనంతరం తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్మల్ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: శివయామ పూజ గురించి తెలుసా?