ETV Bharat / state

'రైతుల ఖాతాల నుంచి 50 లక్షల రూపాయల కోత విధించారు' - nirmal district news

అకారణంగా రైతుల ఖాతాల నుంచి ధాన్యం డబ్బుల చెల్లింపులో కోతలు విధించారని నిర్మల్​ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని తహసీల్దార్​ కార్యాలయం ముందు అఖిలపక్ష నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు. ఒకే గ్రామానికి చెందిన రైతుల ఖాతాల నుంచి 50 లక్షల రూపాయల కోత విధించారని ఆరోపించారు. వెంటనే కోత విధించిన డబ్బులను జమచేయాలని డిమాండ్​ చేశారు.

all party leaders and farmers protest at kuntal mandal in nirmal district
'రైతుల ఖాతాల నుంచి 50 లక్షల రూపాయల కోత విధించారు'
author img

By

Published : Jul 10, 2020, 10:39 PM IST

నిర్మల్​ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్న రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు. అకారణంగా రైతుల ఖాతాల నుంచి ధాన్యం డబ్బుల చెల్లింపులో కోతలు విధించారని ఆందోళన చేశారు. మండలంలోని ఒకే గ్రామానికి చెందిన రైతుల ఖాతాల నుంచి దాదాపు 50 లక్షల రూపాయలు కోత విధించారని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

వెంటనే కోత విధించిన డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 3గంటల పాటు ధర్నా చేపట్టారు. రైతుల వద్దకు చేరుకున్న తహసీల్దార్ వారిని వారం పాటు గడువు కోరడం వల్ల ధర్నాను విరమించుకున్నారు. వారం రోజుల్లో న్యాయం జరగక పోతే జాతీయ రహదారిపై ధర్నా చేపడతామని రైతులు హెచ్చరించారు.

70 వేలు కోత విధించారు..

వరి ధాన్యం 685 బస్తాలు కాగా.. 100 బస్తాలకు చెల్లించే డబ్బులు దాదాపు 70వేల రూపాయలు కోత విధించారు. ఎక్కడ జాప్యం జరిగిందో, ఎవరిని అడగాలో అర్థం కానీ పరిస్థితి ఉంది.

-రాజు, రైతు

రైతుల ఆవేదన..

తన 10 ఎకరాల పొలంలో 285 క్వింటాళ్ల వరి ధాన్యానికి 5లక్షల 11వేల రూపాయలు రావాల్సి ఉండగా... కోత విధించిన అనంతరం 3లక్షల 72వేలు మాత్రమే వచ్చాయని బాబు అంటున్నారు. మిగిలిన డబ్బులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నాడు.

మండలంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ధాన్యాన్ని అమ్మినట్లు రైతులు తెలిపారు. కుంటాల మండలంలో ఇది ఒక స్కామ్​లాగా ఉందని.. రైతులు ధాన్యాన్ని అమ్మినపుడు ఎంత ధాన్యం అయిందో చిట్టీలు కూడా ఇవ్వలేదని రైతులు అంటున్నారు.
ఇవీ చూడండి: రేణికుంటలో రైతు వేదిక శంకుస్థాపనకు విస్తృత ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.