ఏపీలో ఆశావర్కర్లకు చెల్లిస్తున్నట్లుగా తమకూ రూ.10వేల వేతనం చెల్లించాలని రాష్ట్ర ఆశావర్కర్లు డిమాండ్ చేశారు. కరోనా ఇన్సెంటివ్స్ రూ.5000 ఇవ్వాలని కోరారు. ఆశా కార్మికులందరికీ కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
వైరస్ సోకిన ఆశావర్కర్లకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మరణించిన వారికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి రూ.21వేలు ఇవ్వాలని కోరారు.
ఈ మేరకు తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ.. ఈనెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు తెలిపారు.