నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ పరిధిలోని రవీంద్రపూర్ కాలనీలో సావిత్రిబాయి(33) అనే మహిళా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాత్రి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో భోజనం చేసిన ఆమె ఉదయం సమీపంలోని వారి మరో సొంతింటిలో మృతి చెంది కనిపించారు. మృతురాలికి భర్త మాధవ్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: దారుణం: తాతయ్య, నానమ్మే చంపేశారు