నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం శరణు ఘోషతో మార్మోగింది. ఉదయం నుంచే స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. అనంతరం అయ్యప్ప విగ్రహాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. పొరుగు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్, పర్బణి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు.
గోదావరి, స్వర్ణనదిలో పుణ్యస్నానాలు ఆచరించి గురుస్వామి నర్సారెడ్డి నేతృత్వంలో సుమారు 500 మంది భక్తులు అయ్యప్ప మాల స్వీకరించారు. మాలధారణ సమయంలో తీసుకోవాల్సిన నియమాలను గురుస్వామి భక్తులకు వివరించారు. నియమ, నిష్ఠలతో స్వాములు 41 రోజులపాటు దీక్షను కొనసాగించి అయ్యప్పను పూజించాలని తెలిపారు. దీక్ష పూర్తయిన స్వాములు శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శనం చేసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: రెండోరోజూ డిపోలకు వస్తున్న కార్మికులు... అరెస్ట్ చేస్తున్న పోలీసులు