ETV Bharat / state

11నెలల బాబు ప్రాణం తీసిన వాటర్ హీటర్

author img

By

Published : Jan 30, 2020, 7:17 PM IST

వాటర్​​ హీటర్​ షాక్ కొట్టి 11 నెలల బాబు మరణించాడు. ఈ విషాదకర ఘటన నిర్మల్​ జిల్లాలో జరిగింది. బాబు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

11నెలల బాబు ప్రాణం తీసిన వాటర్ హీటర్
11నెలల బాబు ప్రాణం తీసిన వాటర్ హీటర్

నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లక్ష్మణచాంద మండలం కనకాపూర్​లో 11 నెలల బాబు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. భైంసా పట్టణానికి చెందిన జలావర్ సురేశ్​ ఆటో డ్రైవర్​గా పనిచేస్తూ కనకాపూర్​లో తన కుటుంబంతో నివసిస్తున్నాడు.

గురువారం ఉదయం వేడి నీళ్ల కోసం వాటర్​ హీటర్ పెట్టి బయట షాప్​కి వెళ్లాడు. అతని భార్య స్వరూప ఇంటి పని చేసుకుంటూ ఉంది. ఈ సమయంలో 11 నెలల బాబు ఆడుకుంటూ వెళ్లి హీటర్​ని ముట్టుకున్నాడు. అంతే..కరెంటు షాక్​కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించాడు.

ఇవీ చూడండి: గ్యాంగ్ వార్​గా చిత్రీకరించినవారిపై కఠిన చర్యలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.