ముక్కోటి ఏకాదశి సందర్భంగా నారాయణపేట జిల్లాలోని పలు ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. జిల్లాలోని ఆలయాలన్ని భక్తులతో నిండిపోయాయి. వేకువజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు వరుసలు కట్టారు. దీప, ధూప నైవేద్యాలతో తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు.
స్వామివారి దర్శించుకునేందుకు ఆలయ ఆధికారులు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు, అర్చనలు, విష్ణు సహస్రనామార్చనలతో భక్తులు తరించారు. భారీగా తరలివచ్చిన భక్తజనం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి: ఉపరాష్ట్రపతిని కలిసిన భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీ