నారాయణపేట జిల్లా సింగారం క్రాస్ రోడ్డు వద్ద తెరాస పార్టీ జిల్లా నూతన కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ వనజ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు. అన్ని ఎన్నికల్లో తెరాసను గెలిపించిన ప్రజలకు క్షేత్ర స్థాయిలో సేవ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: రాజధానిలో మళ్లీ కొకైన్ కలకలం