ETV Bharat / state

గ్రామీణ విద్యార్థులకు టిటా బృందం డిజిటల్ శిక్షణ - Telangana information technology association

విద్యార్థులకు ఓనమాల దశ నుంచే సాఫ్ట్​వేర్ కోడింగ్, గేమ్స్, యానిమేషన్ రూపకల్పనలో ఆన్​లైన్ శిక్షణ ఇస్తోంది తెలంగాణ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ అసోసియేషన్. టిటా బృందం వివరిస్తోన్న అంశాలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

digital knowledge for students
టిటా బృందం డిజిటల్ శిక్షణ
author img

By

Published : Oct 1, 2020, 7:22 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆన్​లైన్​లో డిజిటల్​ పాఠాలు బోధిస్తోంది. ఓనమాలు నేర్చుకునే దశ నుంచే కంప్యూటర్​తో కుస్తీ పట్టడం నేర్పిస్తోంది. కంప్యూటర్ కోడింగ్, గేమ్స్, యానిమేషన్ రూపకల్పనలో శిక్షణ ఇస్తూ విద్యార్థులను ఇప్పటినుంచే టెక్కీలుగా మారుస్తోంది.

digital knowledge for students
టిటా బృందం డిజిటల్ శిక్షణ

కంప్యూటర్ కమ్యూనికేషన్, మనిషికి, మిషన్​కు అనుసంధానంగా ఉన్న భాషను ఎలా అమలు చేయాలి, ప్రోగ్రామ్ అంటే ఏమిటి, అల్గారిథం ఎందుకు ఉపయోగపడుతుంది, గేమ్స్ ఎలా రూపొందిస్తారు, యానిమేషన్ ఎలా చేస్తారు వంటి అంశాల్లో టిటా బృందం విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. టిటా బృందం సభ్యులు ఇస్తోన్న శిక్షణ.. భవిష్యత్​లో తమకు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.