ETV Bharat / state

ధర్నాకు దిగిన తీలేరు వాసులు.. కలెక్టర్ హామీతో విరమణ - కలెక్టర్ హరిచందన తాజా వార్తలు

నారాయణపేట్ జిల్లా తీలేరు వాసులు 167 జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. శ్మశానవాటిక, ప్రకృతి వనం ప్రాంతాలను మార్చాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ హామీతో ఆందోళన విరమించారు.

Thileru residents protest  on the National Highway 167 in Narayanpet District
ధర్నాకు దిగిన తీలేరు వాసులు.. కలెక్టర్ హామీతో విరమణ
author img

By

Published : Oct 16, 2020, 1:04 PM IST

జాతీయరహదారిపై ధర్నాకు దిగిన నారాయణపేట్ జిల్లా తీలేరు వాసులు... కలెక్టర్‌ హరిచందన హమీతో ఆందోళన విరమించారు. పల్లెప్రకృతి వనం, శ్మశానవాటిక ఏర్పాటు చేసే స్థలాలను మార్చాలంటూ 167 జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.

పంచాయతీ తీర్మానం చేసిన చోటే నిర్మాణాలు చేపట్టాలని ఆందోళన చేపట్టారు. జడ్చర్ల-రాయచూర్‌ రహదారిపై బైఠాయించిన గ్రామస్థులు కలెక్టర్‌ వచ్చి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌, ఎంపీడీవోతో మాట్లాడిన కలెక్టర్‌ హరిచందన.... ఆందోళన విరమించి కలెక్టరేట్‌కు రావాలని సూచించడంతో శాంతించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.