Minister harish rao on anm death: విధి నిర్వహణలో భాగంగా ఓ గ్రామానికి వెళ్తున్న ఏఎన్ఎం.. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన ఏఎన్ఎం వరలక్ష్మి.. ఇటీవల మాగనూరు మండల కేంద్రం నుంచి కొల్పూర్ గ్రామానికి.. విధి నిర్వహణలో భాగంగా స్కూటీపై వెళ్తున్నారు. ఆ సమయంలో వడ్వాట్ గేటు వద్ద లారీ ఢీకొని వరలక్ష్మీ మృతి చెందింది.
రూ. 50 లక్షల బీమా సొమ్ము
ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి.. కరోనా కష్ట కాలంలో విధుల్లో ఉండి మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షల బీమా సొమ్ము అందుతుందని పేర్కొన్నారు. వారి కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. మృతులకు ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా వైద్య అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వరలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొవిడ్ సంక్షోభంలో ప్రజలకు వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
-
ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించడం జరిగింది. వరలక్ష్మి గారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. వారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
— Harish Rao Thanneeru (@trsharish) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించడం జరిగింది. వరలక్ష్మి గారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. వారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
— Harish Rao Thanneeru (@trsharish) December 8, 2021ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించడం జరిగింది. వరలక్ష్మి గారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. వారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
— Harish Rao Thanneeru (@trsharish) December 8, 2021
ఇదీ చదవండి: Governor with farmers: 'నేను ఎవరో తెలుసా... మీకోసమే వచ్చా'