ETV Bharat / state

ఇసుక డంపులపై టాస్క్​ఫోర్స్ దాడులు - మాగనూరు పోలీస్​స్టేషన్

అక్రమంగా తరలిస్తున్న ఇసుకను టాస్క్​ఫోర్స్​ అధికారులు పట్టుకున్న ఘటన నారాయణ పేట జిల్లా మక్తల్ పోలీస్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. వేర్వేరు ప్రాంతాల్లో విస్తృత దాడులు నిర్వహించిన అధికారులు సుమారు 100 ట్రిప్పుల ఇసుక డంప్​తో పాటు ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు.

Task force caught the sand moving illegally in narayanpet
టాస్క్ ఫోర్స్ దాడులు..ఇసుక డంప్ స్వాధీనం.
author img

By

Published : Dec 22, 2020, 4:54 PM IST

నారాయణపేట జిల్లాలో ఇసుక దందాపై టాస్క్​ఫోర్స్​ అధికారులు కొరడా విదిలించారు. అనుమతి లేకుండా ఇసుక రవాణాకు పాల్పడుతున్న వ్యక్తితోపాటు లారీని స్వాధీనం చేసుకొని పోలీస్​స్టేషన్​కు అప్పగించారు. లారీ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని ఎస్ఐ రాములు తెలిపారు.

మరోక ఘటనలో.. మాగనూరు పోలీస్​స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు స్థలంలో సుమారు 100 ట్రిప్పుల ఇసుక డంప్​ను టాస్క్​ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఎస్ఐ శివనాగేశ్వరరావు ఇసుక డంప్​ను సీజ్ చేసి.. తహసీల్దార్ తిరుపతి కు అప్పగించారు.

ఇదీ చదవండి: అధికారుల నిర్లక్ష్యం.. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.