నారాయణపేట జిల్లా పీఆర్టీయూ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కాట్రపల్లి జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించాలంటే.. ప్రతి విద్యార్థిలో పట్టుదల ఉండాలని ఎంపీ సూచించారు. పట్టుదలతో చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ఎందులో తక్కువకాదన్నారు ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పటిష్ఠమైన చట్టాలతోనే మెరుగైన సేవలు: కేసీఆర్