ETV Bharat / state

'దారిలేని బడికి రాలేం.. టీసీలు ఇవ్వండి' - students protest for TC

ఆ ఊరి విద్యార్థులు పక్క ఊళ్లో ఉన్న సర్కార్ బడికి వెళ్లాలంటే ముప్పుతిప్పలు పడాల్సిందే. పొలాల మధ్య నుంచి.. రాళ్లురప్పల పై నుంచి నానాఅవస్థలు పడుతూ వెళ్లాల్సిందే. ఏళ్ల తరబడి ఇదే సమస్య. కొన్నేళ్ల కిందట రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కానీ రోడ్డు పొలాల మధ్య నుంచి వెళ్తుండటంతో రైతులు అడ్డుకున్నారు. అంతే ఇక అక్కడే పనులకు బ్రేక్ పడింది. రోడ్డులేక అవస్థలు పడుతూ బడికి వెళ్లలేక విద్యార్థులంతా వారి తల్లిదండ్రులతో వెళ్లి తాము రోడ్డు వేసే వరకు బడికి రామని.. టీసీలు ఇవ్వమని పాఠశాల ముందు బైఠాయించారు.

'దారిలేని బడికి రాలేం.. టీసీలు ఇవ్వండి'
'దారిలేని బడికి రాలేం.. టీసీలు ఇవ్వండి'
author img

By

Published : Jun 21, 2022, 8:35 AM IST

దారిలేని బడికి రాలేమంటూ విద్యార్థులు మూకుమ్మడిగా టీసీలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇచ్చేవరకూ తల్లిదండ్రులతో కలిసి అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. నారాయణపేట జిల్లాలో జరిగిందీ ఘటన. దామరగిద్ద మండలం ఉలిగుండం గ్రామ విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న విఠలాపూర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. దారి లేకపోవడంతో పొలాల గుండా రాకపోకలు సాగించేవారు. కొన్నేళ్ల కిందట రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఉలిగుండం నుంచి గ్రామ శివారు వరకు కిలోమీటరు దూరం రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఆ దశలో విఠలాపూర్‌ గ్రామ నాయకులు అడ్డుచెప్పారు. తమ పొలాల గుండా రోడ్డు వేయడానికి వీల్లేదని తేల్చిచెప్పడంతో పనులు అసంపూర్తిగా ఆగాయి.

.

పలుమార్లు ధర్నా చేసినా.... రోడ్డు పనులు పూర్తిచేసి రవాణా సదుపాయం కల్పించాలంటూ ఉలిగుండం విద్యార్థులు పలుమార్లు ధర్నాలు చేశారు. ఈ నెల 16న కూడా తల్లిదండ్రులతో కలిసి పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దారిలేని బడికి రాలేమని, టీసీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రెండ్రోజుల సమయం ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడు కోరిన మీదట ధర్నా విరమించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం మరోసారి విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల వద్ద ధర్నా చేపట్టారు. టీసీలు ఇవ్వాల్సిందేనని కోరుతూ 58 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇచ్చేవరకు వెళ్లబోమంటూ మధ్యాహ్నం అక్కడే వంట చేసుకుని తిన్నారు. ప్రధానోపాధ్యాయుడు బసిరెడ్డి సమస్యను జిల్లా విద్యాశాఖ అధికారి లియాఖత్‌ అలీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చెప్పినా వారు వినకపోవడంతో ఉపాధ్యాయులు టీసీలు ఇచ్చేందుకే సిద్ధపడ్డారు. ‘రాత్రి 8.30 గంటల సమయానికి 35 టీసీలు రాశామని, మంగళవారం ఉదయానికి అన్నీ పూర్తిచేసి ఇచ్చేస్తామని’ ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.