నారాయణపేట జిల్లా కేంద్రంలో రహదారి పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. నీటి పైపులు పగిలి రోడ్లు బురదయంగా మారుతున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల వ్యాపారాలకు ఆటంకంగా మారుతోందని బాధితులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఈవీఎంలను పేల్చేస్తా... మంత్రులు, ఎమ్మెల్యేలకు మెసేజ్