నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పస్పల వద్ద కృష్ణా నదిలో పుట్టి మునిగిన ఘటనలో అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంచదేవ్ పహాడ్‌కు చేరుకున్నాయి. గల్లంతైన నలుగురి కోసం 2 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టాయి. కర్ణాటక, తెలంగాణ పోలీసులు, అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఏం జరిగిందంటే..
పస్పల వద్ద కృష్ణా నదిలో సోమవారం ఓ పుట్టి నీట మునిగింది. గమనించిన మరో పుట్టిలోని ప్రయాణికులు 9 మందిని కాపాడగా.. ఓ చిన్నారి సహా ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కురవపురానికి చెందిన సుమలత, రోజా, పార్వతమ్మ, నర్సమ్మగా గుర్తించారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇదీచూడండి: శాంతి స్థాపనలో ప్రజల నమ్మకం పొందడం కీలకం: గవర్నర్