ETV Bharat / state

'కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు'

సివిల్స్​లో 272వ ర్యాంకును సాధించిన రాహుల్​ను విద్యుత్​శాఖ డీఈ సన్మానించారు. నెల రోజుల క్రితం నారాయణపేట విద్యుత్​ శాఖలో ఏఈగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్​ సివిల్స్​లో ర్యాంకు సాధించి చాలా మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

narayanpet power department de appreciated civils ranker

author img

By

Published : Aug 6, 2020, 11:35 AM IST

కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని విద్యుత్​శాఖ డీఈ చంద్రమౌలి తెలిపారు. నెల రోజుల క్రితం నారాయణపేట విద్యుత్​శాఖలో ఏఈగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్​... సివిల్స్​లో 272 ర్యాంకు సాధించటాన్ని కొనియాడారు. విద్యుత్​ శాఖ తరఫున రాహుల్​ను సన్మానించారు.

వలసల జిల్లాగా చెప్పుకునే నారాయణపేట పేరును రాహుల్ తన సివిల్స్ లక్ష్యంతో నలువైపులా మారుమోగించారన్నారు. చదువుపై శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా... లక్ష్యాన్ని చేరుకోవచ్చని రాహుల్​ నిరూపించారన్నారు. నేటి తరం విద్యార్థులు రాహుల్​ను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలను ఛేదించాలని చంద్రమౌలి సూచించారు.

ఇదీ చదవండి: పిల్లలను అమ్మగా లాలించండి కానీ... భయపెట్టొద్దు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.