ETV Bharat / state

సిబ్బంది లేరు.. ఆదాయమూ లేదు - market yards

జిల్లాలో మార్కెటింగ్​ శాఖ కార్యాలయాలు నామమాత్రంగా మిగిలాయి. అవసరమైన సిబ్బంది లేక నూతన నియామకాలు చేపట్టక మార్కెట్​ యార్డు కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.

సిబ్బంది లేరు.. ఆదాయమూ లేదు
author img

By

Published : Jul 2, 2019, 5:18 PM IST

వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో అక్రమాలను పూర్తిగా అరికట్టి, ఈ-నామ్‌ విధానం సమర్థవంతంగా అమలు జరిగేలా పర్యవేక్షించాల్సిన జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారుల (డీఎంవోలు) కార్యాలయాలు గత కొన్నేళ్లుగా సిబ్బంది కొరతతో వెలవెలబోతున్నాయి. పేరుకు డీఎంవో కార్యాలయాలైనా.. అక్కడ డీఎంవో తప్ప అటెండర్​ సైతం లేరు. ఒక్కప్పుడు ఉమ్మడి జిల్లా కేంద్రంగా మహబూబ్‌నగర్‌లోనే ప్రధాన కార్యాలయం ఉండగా.. జిల్లాల విభజన అనంతరం మొదటగా ఏర్పడిన నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల జిల్లా కేంద్రాల్లో జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి కార్యాలయాలను ప్రారంభించారు. అయిదో జిల్లాగా ఏర్పడిన నారాయణపేటలోనూ డీఎంవో కార్యాలయం ఏర్పాటుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటి వరకు ఏ జిల్లాలోనూ డీఎంవో తప్ప ఇతర సిబ్బందిని నియమించనే లేదు.

ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు పరిధిలో మొత్తం 17 వ్యవసాయ మార్కెట్‌ యార్డు కార్యాలయాల పర్యవేక్షణ ఉండేది. ప్రస్తుతం నారాయణపేట డీఎంవో కార్యాలయానికి ఇన్‌ఛార్జిగా మహబూబ్‌నగర్‌ అధికారి భాస్కరయ్యకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదనంగా ఒక్క పోస్టును మంజూరు చేయలేదు. సాధారణంగా జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి కార్యాలయాల్లో ఒక సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంటు తోపాటు యూడీసీ, ఎల్‌డీసీ, ఒక టైపిస్టు, ఇద్దరు అంతర్జాల ఆపరేటర్లు, కనీసం ముగ్గురు అటెండర్లు అవసరం ఉంటుంది.

ఏటా తగ్గుతున్న ఆదాయం

ఉమ్మడి జిల్లాలోని షాద్‌నగర్‌ మినహాయించి 17 వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో ఏటా కార్యాలయాల ఆదాయం తగ్గుతూ వస్తోంది. విశాలమైన స్థలం.. ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు, సరకు నిల్వ చేసుకునేందుకు గోదాంలు.. ఉన్నా.. గత రెండేళ్ల నుంచి మార్కెట్‌యార్డుల్లో పంట దిగుబడుల విక్రయాలు క్రమేపీ తగ్గుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ సంస్థల ద్వారా కందులు, పెసలను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. జిల్లాలో వరిధాన్యాన్ని ఏటా రబీ, ఖరీఫ్‌ సీజన్లలో మహిళా సమాఖ్య, మెప్మా, సింగిల్‌ విండోల ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తొంది. దీని వల్ల యార్డుల్లోని కమీషన్‌ ఏజెంట్ల దుకాణాల ఫ్లాట్‌ఫాంలు ప్రధాన సీజన్లలో బోసి పోయి ఉంటున్నాయి.

ఏటా ఖరీదు దారులు జరిపే క్రయ విక్రయాల ఆధారంగా మార్కెట్‌ యార్డులకు రుసుం వసూలయ్యేది. గత రెండేళ్లుగా ఒక్క వేరుశనగ సీజను మినహా కందులు, పెసర, వరి ధాన్యం సీజన్లలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఏర్పాటు చేస్తుండటంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేసే పంట ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్‌ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మార్కెట్‌ యార్డులకు వచ్చే రుసుముకు గండి పడినట్లయ్యింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 70 శాతం మార్కెట్‌ రుసుం లక్ష్య సాధన అధికారులకు తలకు మించిన భారం అవుతోంది. ఉమ్మడి జిల్లాలో కేవలం చెక్‌పోస్టులు ఉన్న మార్కెట్‌ యార్డుల్లో ఆయా చెక్‌పోస్టుల ద్వారా రుసుం వసూలు అవుతుండగా.. మిగతా కార్యాలయాల్లో సిబ్బందికి నెల నెలా వేతనాలు చెల్లించడమే భారంగా మారుతోంది.

మార్కెటింగ్‌శాఖలో కొత్త నియామకాలేం జరగకపోగా, ఉన్న అధికారులు ఏటా పదవీ విరమణ పొందుతుండటంతో అధికారుల కొరత ఏర్పడుతోంది. మార్కెట్‌ యార్డుల్లో కార్యదర్శుల పోస్టుల విషయంలోనూ ఇదే సమస్య నెలకొంది. కార్యదర్శులంతా పదవీ విమరణ పొందుతుండగా, ఉన్న ఒక్కో కార్యదర్శికి అదనంగా రెండేసి మార్కెట్‌యార్డులకు ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగిస్తున్నారు.

ఇవీ చూడండి: భానుడి భగభగలకు 8కోట్ల మంది శ్రమ ఆవిరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.