ETV Bharat / state

ఆ బాధ్యత సీపీడీవో, సూపర్​వైజర్లదే..! - Narayanpet Collector Review on Nutrition Week

ఒక్క శిశువు కూడా పోషకాహార లోపానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత సీడీపీవో, సూపర్​వైజర్లదేనని నారాయణపేట జిల్లా కలెక్టర్​ హరిచందన అన్నారు. జిల్లా కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ నిర్వహించే పోషణ వారోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Narayanpet Collector Review on Nutrition Week
ఆ బాధ్యత సీపీడీఓ, సూపర్​వైజర్లదే..!
author img

By

Published : Mar 19, 2021, 9:09 PM IST

ప్రజలందరూ పోషకాహారం తీసుకునేలా అంగన్వాడి టీచర్లు ప్రజలలో చైతన్యం కలిగించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. జిల్లాలో శిశు సంక్షేమ శాఖ నిర్వహించే పోషణ వారోత్సవాల నిర్వహణపై సీపీడీవో, సూపర్​వైజర్లతో సమీక్ష నిర్వహించారు.

పోషక వనాలు ఏర్పాటు చేయడంలో అంగన్వాడీ టీచర్ల పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్​ హరిచందన అన్నారు. పోషక వనాలలో పండించిన ఆకు కూరలు, కూరగాయలు తల్లులకు పంచి పెట్టడం, పంపిణీ చేసిన కూరగాయలు గర్బిణీలు, బాలింతలు తింటున్నారా? లేదా? అనే విషయాన్ని తప్పక పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఒక్క శిశువు కూడా పోషకాహార లోపానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత సీపీడీవో, సూపర్​వైజర్లదేనని స్పష్టం చేశారు.

ఆసుపత్రి పరిశీలన

నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్​ హరిచందన పరిశీలించారు. చికిత్స కోసం వచ్చిన రోగులకు డైట్ చాట్ ప్రకారం ఆహరం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యశాఖ అధికారులు, సీపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ఆ విషయంలో షర్మిల అభిప్రాయం చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.