నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలోని బిజ్వార్, పులిమామిడి గ్రామాల్లో జిల్లా పాలనాధికారి హరిచందన పర్యటించారు. గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణ పనులను, ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ హరిచందన పరిశీలించారు.
ఆన్లైన్లో ఆస్తుల నమోదు గడువు సమీపిస్తుండడం వల్ల సర్వేను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి, ప్రత్యేక అధికారి భూపాల్ రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్, ఎంపీవో రవికుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: దుబ్బాక అభ్యర్థి సుజాతను కలిసిన మంత్రి హరీశ్‌రావు