నారాయణపేట్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతనలు మొక్కలు నాటారు. నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. వాతావరణ సమతుల్యతతోపాటు, భావితరాలకు హరిత తెలంగాణను బహుమతిగా ఇవ్వాలన్నారు.
నాటిన మొక్కలకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో కలెక్టర్ హరిచందన, మున్సిపల్ ఛైర్పర్సన్ గందె అనసూయలు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీ చేతన పరేడ్ గ్రౌండ్లో డీఎస్పీ, పలువురు పోలీసు అధికారులతో కలిసి మెుక్కలు నాటారు.
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: నెలరోజుల్లో ఎన్నివేల కోట్లు తాగేశారో తెలుసా?