అంబేడ్కర్ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లాలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం దామరగిద్ద మండలానికి చెందిన కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో కొందరు యువకులు అంబేడ్కర్ జయంతి సందర్భంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిచందన హాజరయ్యారు.
ఇదీ చూడండి: 'పొద్దుపోకుంటే యోగా చేస్కోండి.. ఆరోగ్యానికి మంచిది'