నారాయణపేట జిల్లాలో గత మూడు నెలలుగా లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో డబ్బులు లేక పూట గడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన , ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో 200మంది చేనేత కార్మికులకు రూ.1500, మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. హైదరాబాద్ ప్రొఫెసర్స్ అసోసియేషన్, టెస్కో వారి సౌజన్యంతో200 మంది చేనేత కార్మికులకు నగదు సాయం చేశారు.
ఇదీ చదవండి: ఈటల ఓఎస్డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి