ETV Bharat / state

హరితహారం - మొక్కలు నాటిన ఎమ్మెల్యే చిట్టెం - హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే రామ్మోహన్​రెడ్డి

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్​ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి పర్యటించారు. ఆయా పట్టణాల్లో మొక్కలు నాటారు.

mla Ram mohan Reddy participated in harithaharam
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన రామ్మోహన్​రెడ్డి
author img

By

Published : Jun 25, 2020, 12:18 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, మాగనూరు, కృష్ణ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి​ పర్యటించారు. ఈ సందర్భంగా ఆరోవిడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ముందుగా మక్తల్​ పట్టణ కేంద్రంలోని ఐదోవార్డు మైనార్టీ కాలనీలో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం మాగనూర్ మండల కేంద్రంలో కొత్తపల్లి గ్రామానికి వెళ్లే రహదారి గుండా.. కృష్ణా మండలంలోని చేగుంట, కున్సీ గ్రామాలకు వెళ్లే రహదారుల గుండా మొక్కలు నాటారు.

రహదారుల వెంట మొక్కలు నాటి సంరక్షించే కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలని సూచించారు. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు లోబడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. ఆరో విడత హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఇదీచూడండి: వరంగల్​లో ఆరో విడత హరితహారాన్ని ప్రారంభించిన ఎర్రబెల్లి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.