నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 161 కల్యాణలక్ష్మి, 23 షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. నిరుపేదలకు ఏకష్టం రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయని ఆయన అన్నారు.
దేశ వ్యాప్తంగా ఎక్కడాలేని పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ నిరుపేదల కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ ఛైర్మన్ వనజ, మక్తల్ తహసీల్దార్ తిరుపతయ్య, మార్కెట్ ఛైర్మన్ రాజేశ్గౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పారిశుద్ధ్య కార్మికులకు మేయర్ నూతన వస్త్రాల బహుకరణ